నేటితో ముగుస్తున్న ఆసియా క్రీడలు-2018

ఇండోనేషియా దేశం జకార్తా నగరంలో జరుగుతున్న 2018 ఆసియా క్రీడలు ఈ రోజుతో ముగుస్తాయి. ఆసియా క్రీడల్లో భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారతదేశం 69 పతకాలు సాదించింది. వీటిలో 15 స్వర్ణ పతకాలు, 24 రజత పతకాలు, 30 కాంస్య పతకాలు ఉన్నాయి. 289 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో 75 స్వర్ణ పతకాలతో జపాన్, మూడో స్థానంలో 49 స్వర్ణ పతకాలతో రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నాలుగో స్థానంలో 31 స్వర్ణ పతకాలతో ఇండినేషియా, ఐదో స్థానంలో 21 స్వర్ణ పతకాలతో ఉజ్బెకిస్తాన్, ఆరో స్థానంలో 20 స్వర్ణ పతకాలతో ఇరాన్, ఏడో స్థానంలో 17 స్వర్ణ పతకాలతో చైనీస్ తైపీ , 8వ స్థానంలో 15 స్వర్ణ పతకాలతో ఇండియా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here