అమరావతి బాండ్లపై ఉండవల్లి ఆగ్రహం

అమరావతి బాండ్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాండ్ల ద్వారా తీసుకున్న రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు ప్రతి మూడునెలలకు 10.36 శాతం అధిక వడ్డీ చెల్లించాలని అన్నారు. అమరావతి బాండ్లలో బ్రోకర్ కు 17 కోట్ల రూపాయలు ఇవ్వడమే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న పారదర్శకతా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అమరావతి బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను ప్రభుత్వం బయట పెట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవద్దంటూ ఏడు నెలల క్రితమే జీవో జారీచేశారని గుర్తు చేశారు. గత నాలుగేళ్లలో తీసుకున్న 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం ఏం చేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అప్పట్లో విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు నాయుడు సలహాదారు పాస్కల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైలులో ఉన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here