నేను ఆంధ్రా వోడినే..ఇక్కడే ఉంటా: కత్తి మహేష్

సీతారాములను నిందిస్తూ మాట్లాడిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు.., నగర బహిష్కరణ విధించి, బెంగుళూరు తీసుకెళ్లి వదిలిన సంగతి తెలిసిందే. దీంతో కత్తి మహేష్ గత కొంతకాలంగా బెంగుళూరులోనే ఉన్నారు. కానీ ఇకమీదట కత్తి మహేష్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు. తాజాగా తాను ఉండేది విజయవాడలోనే అని ఒక ప్రకటన చేశారు. సోమవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కత్తి మహేష్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తినేనని.., తనపై హైదరాబాద్ సిటీ నిషేధం మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కాకుండా ఇంకా ఎక్కడైనా ఉండవచ్చని.., తాను ఆంద్రప్రదేశ్ కు చెందినవాడిని కాబట్టి ఇకనుంచి విజయవాడలో ఉండేందుకు వచ్చానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here