జబర్దస్త్ సుధాకర్ కు గౌరవ డాక్టరేట్

పాలమూరు పట్టణానికి చెందిన జబర్దస్త్ నటుడు, గాలిపటాల సుధాకర్ కు, తమిళనాడుకు చెందిన కోయంబత్తూర్ రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ, గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. జబర్దస్త్ నటుడిగా సుధాకర్ అందరికీ సుపరిచితుడే. కళారంగంలో దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వేల స్టేజీ ప్రదర్శనలు ఇచ్చినందుకు గానూ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 8న దుబాయ్ లో నిర్వహించే ఓ కార్యక్రమంలో సుధాకర్ కు డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నారు. సుధాకర్ కు డాక్టరేట్ రావడంపై ఆయన అభిమానులు, పాలమూరుకు చెందిన కళాకారులు, తోటి జబర్దస్త్ నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here