ప్రగతి నివేదన సభకు వచ్చింది రెండున్నర లక్షలే

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వచ్చింది, కేవలం రెండున్నర లక్షల మందేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల డీకె అరుణ స్పష్టం చేశారు. సోమవారం డీకె అరుణ మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నివేదన సభ పెద్ద ఫ్లాఫ్ షోగా మిగిలిపోయిందని అన్నారు. ప్రజలు విహార యాత్రకు వచ్చి వెళ్లినట్లు సభకు వచ్చివెళ్లారని డీకే అరుణ ఎద్దేవాచేశారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి నిన్నటి ప్రగతి నివేదన సభే నిదర్శనమన్నారు.ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై చంద్రశేఖర్ రావు ముందు గళం విప్పాలని సూచించారు. నిన్న సభను చూసుకుని, ముందస్తుకు వెళితే ఒడిపోతానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అర్ధమైనట్లుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here