ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాఫ్: షబ్బీర్ అలీ

తెరాస ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. సభకు రెండు లక్షలకు మించి జనాలు రాలేదన్నారు. సభకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రజల నుంచి స్పందన కరువైందని విమర్శించారు. ప్రగతి నివేదన సభలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి గాని, దళితులకు మూడెకరాల భూ పంపిణీ గురించి కానీ ఎందుకు చెప్పలేకపోయారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మైనారిటీ రిజెర్వేషన్ల పై ఢిల్లీలో భూకంపం ఏమైందని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్లి నరేంద్రమోదీ కాళ్లు ఎందుకు మొక్కుతున్నారని ప్రశ్నించారు. ప్రగతి నివేదన సభ ఫెయిల్ అయ్యింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లక పోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here