నాపై ఆరోపణలు నిరూపిస్తే నా ఆస్థి రాసిస్తా: శివాజీ రాజా

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు స్వాహా అయ్యాయంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా- మా కార్యదర్శి నరేష్ మధ్య గొడవ జరిగి మా ఆఫీసుకు నరేష్ తాళం వేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 1 రాత్రి మా సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించి వివాదంపై వివరణ తీసుకున్నారు. సద్దుమణిగిందిలే అనుకున్న వివాదం, ఇంకా సద్దుమణగక పోవడంతో తాజాగా శ్రీకాంత్, శివాజీ రాజా మరోసారి దీనిపై స్పందించారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ మా లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారు ఆ ఆరోపణలను నిరూపించాలన్నారు. ఒకవేళ అవినీతి జరిగిందని నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శ్రీకాంత్ అన్నారు. అలాగే శివాజీ రాజా మాట్లాడుతూ., ఒక్కపైసా దుర్వినియోగం అయినట్లు నిరూపిస్తే తన ఆస్తినంతా మా అసోసియేషన్ కు రాసిచ్చేస్తానని పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సమకూరిన డబ్బులతో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాలన్నదే మాలక్ష్యమని శివాజీ రాజా తెలిపారు. అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, కావాలనే కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం మేరకే డబ్బులు వసూలు చేశామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here