ప్రగతి నివేదన సభ చప్పగా సాగింది: కోదండరాం

టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ చప్పగా సాగిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగంలో స్పస్టత కొరవడిందని తెలిపారు. ఓటమిని ముందే అంగీకరించిన క్రీడాకారుడిలా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీరు ఉందని కోదండరాం విమర్శించారు. ఈ ప్రగతి నివేదన సభతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పతనం ఆరంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు రావని(రావు) తెలంగాణ యువతకు ఈ సభతో అర్ధమైందని జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here